చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు పెళ్లికి అంగీకరించడంలేదని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. కర్నూల్ జిల్లా మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఇద్దరు ఆత్మ హత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన సమీపంలో నోట్ బుక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, కులదీప్ పరియార్ లు గా గుర్తించారు రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్ కి చెందిన ప్రతాప్ సింగ్, కులదీప్ పరియర్ లు గుంతకల్లు పట్టణంలోని నివాసిస్తూ.. పానీపూరి విక్రయించి జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా గుంతకల్లులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇదే సమయంలో.. మధ్యప్రదేశ్ చెందిన కులదీప్తో ప్రేమలు పడింది. ఈ వ్యవహారం పెద్దల వరకు చేరింది.. కానీ, వారి పెళ్లికి పెద్దలు కాదనడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రేమ జంట ఆత్మహత్య..
