ఏపీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియాసైకోను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఏపీ హోంమంత్రి అనిత పై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో హోం మంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్ తమ ఆఫీస్‌లోనే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి సవాల్ విసరడంతో పోలీసులు నేరుగా వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.
హోంమంత్రి పై అసభ్య పోస్టులు పోలీసులకు పట్టించిన మాజీ మంత్రి..
