సాధారణ ప్రజలకు ఎన్నో ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే, గృహజ్యోతి పథకం అర్హులకు అందేనా? అన్న అనుమానాలు అనేకం సామాన్య ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో గృహజ్యోతి పథకానికి అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. తెలుపు రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత కరెంట్ అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. రెండు వందల యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని అర్హులైన వారికి అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నో ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి..
