తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే అన్ని రంగాల్లోనూ రాణిస్తూ స్టార్ హీరో అనే పేరుకు సరైన అర్థం చెప్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని రీతిలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న అతడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. దీంతో అతడి రేంజ్ అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ గురించి ప్రముఖ నటుడు ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ నటుడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అంతేకాదు, ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ ఇండియాలోనే నెంబర్ వన్ అంటూ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత అజయ్ కంటిన్యూ చేస్తూ.. ‘ఎన్టీఆర్ అంటే కాంబో ఆఫ్ యాక్టింగ్. డ్యాన్స్‌లో కూడా అతడు టాప్. నాకు తెలిసి వరల్డ్‌లోనే అతడు బెస్ట్ డ్యాన్సర్. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ చేసేటప్పుడు 62 కౌంట్లు ఉంటే అలా చూసి ఇలా చేసేస్తాడు. నేను ఇది నా కళ్లతో చూసి చెబుతున్నాను. యాక్టింగ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఊహించని రీతిలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నNTR..
