అందం, అభినయంతోపాటు అదృష్టం ఉన్న భామలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలంటి వారిలో మాళవికా మోహన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోనూ బిజీ కాబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. మాళవిక మోహన్ 2019లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన పెట్టా చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ కు చెల్లిగా కనిపించింది. ఈ సినిమా ద్వారానే కోలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ఈ చిత్రం తరువాత మాళవిక మోహనన్ 2021 లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ చిత్రంలో నటించింది. నటుడు విజయ్ కు జోడీగా ఈ చిన్నది నటించింది. తమిళ అభిమానులలో ప్రజాదరణ పొందింది ఈ చిన్నది. ఇక రీసెంట్ గా దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్ లో 2024లో విడుదల అయిన తంగళన్ చిత్రంలో ఆర్తిగా ప్రధాన పాత్ర పోషించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్టర్, పెట్టా, తంగళన్ వంటి సినిమాలు ఆయనకు వరుస సినిమాలతో బిజీగా మారింది. నటుడు ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ చిన్నది.