ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రాండ్ నర్సరీ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారు. అవి చాలా రకాలుంటాయి. వాటిని చూసి, నచ్చిన వాటిని ప్రజలు కొనుక్కోవచ్చు. నర్సరీ ఉత్పత్తుల సంగతి మీకు తెలుసు అవి ఇళ్లకు ఎంతో అందాన్ని ఇస్తాయి. అలాగే మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంటి పర్యావరణం కూడా బాగుంటుంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాకి వెళ్తే మీకు ఈ మేళా కనిపిస్తుంది. ఇందులో అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తులు మీకు ఉంటాయి. వాటిని మీరు పరిశీలించవచ్చు. ఒకవేళ మీరు ఇవాళ వెళ్లలేము కుదరదు అనుకుంటే టెన్షన్ అక్కర్లేదు. ఈ మేళా సెప్టెంబర్ 2 వరకూ కొనసాగుతుంది. ఈ మేళా రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.
ఇది తెలిస్తే వెంటనే నెక్లెస్ రోడ్‌కి వెళ్తారు..
