ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా ఎంతో బాక్సాఫీస్ కు చూపించారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదలైంది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా భారీగా రిలీజ్ అయ్యింది పుష్ప 2 ది రూల్ దూసుకుపోతుంది. తొలిరోజే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే వసూళ్లు కూడా భారీగానే రాబడుతుంది ఈ సినిమా. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 175కోట్లు వసూళ్లు సాధించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 294 కోట్లు వసూల్ చేసింది.