సీఏం చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ ఎవరైనా జగన్ ను ఫాలో కావాల్సిందే భూ రీసర్వే పై యూ టర్న్ తీసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భూ రీసర్వే పై తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు మరలా మేము భూ రీసర్వే చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలో జగన్ తెచ్చిన సమగ్ర భూ రీ-సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జులై 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భూములు పై శ్వేతపత్రం విడుదల చేసి ప్రకటించారు. ఎన్నికల ముందు కూడా ఈ భూ రీసర్వేపై ఎన్నో ఆరోపణలు చేశారు చంద్రబాబు. అయితే 15రోజులు గడవకుండనే యూ-టర్న్ తీసుకున్నట్టు కనబడుతుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ భూ రీ-సర్వే కార్యక్రమం మంచిదే అని ఏమైనా లోపాలు ఉంటే గ్రామసభలు పెట్టి పరిష్కరించి మళ్ళీ రీ-సర్వే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతునట్టు ప్రకటించారు.
భూ రీసర్వే పై యూ టర్న్ తీసుకున్న కూటమి ప్రభుత్వం..
