భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలను జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివ్ చేసింది. 2028 వరకు దేశవ్యాప్తంగా మోహరించాలని ఆదేశించింది. సంసిద్ధతను పెంచడం, వ్యూహాత్మక బలోపేతం కోసం టెరిటోరియల్ ఆర్మీని పిలుస్తున్నట్లు రక్షణ వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో టెరిటోరియన్ ఆర్మీని రంగంలోకి దించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి కేంద్రం మరిన్ని అధికారాలు కల్పించింది. సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆర్మీ అధికారులు, సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్‌కి కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి సూచించింది.
భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో రక్షణ శాఖ కీలక ఆదేశాలు..
