ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్ట్ లో పర్యటించి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయించిన విషయం తెలిసిందే. అయితే రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ఆ షిప్‌ను పోర్టు అధికారులు సీజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి సమస్య వచ్చినా తాను చూసుకుంటానని ‘సీజ్ ది షిప్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ఉధృతమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తాజాగా కేంద్రం ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టెల్లా షిష్ సీజ్ కుదరదని కేంద్రం తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్‌కి ఎన్సీఎల్ లేఖ రావడంతో రేషన్ బియ్యం మినహా మిగిలిన రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.