జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిశారు..

jc-divakar-29.jpg

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ విజయమ్మను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కలవడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ అంటేనే గిట్టని ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిశారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. విజయమ్మ స్వగ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉండడంతో జేసీ ఫ్యామిలీతో ఆమెకు బంధుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉండేది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జేపీ దివాకర్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే వైఎస్ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఈ రెండు కుటుంబాలకు మధ్య విభేదాలు వచ్చాయి.

Share this post