కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది ఆమె మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మీడియాతో మాట్లాడారు.
గుంటూరులో అమ్మాయిపై ఓ రౌడీషీటర్ దారుణానికి పాల్పడితే ఇంతవరకు హోం మంత్రి అనిత నోరు మెదపలేదు. ఆమెకు మీకు బాధ్యత లేదా?. గుంటూరు ఘటనలో రౌడీషీటర్ వెనుక ఉన్నది ఎవరూ? తెనాలి,గుంటూరులో టీడీపీ నాయకులు ఏమయ్యారు. హోం మంత్రి ఎక్కడ దాక్కున్నారు. అడ్డమైన ఆరోపణలు చేయడం, ప్రతిపక్షంపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడానికేనా నీకు మంత్రి పదవి ఇచ్చింది. ప్రజలు బిక్కుబిక్కుమం