శ్యామలకు కీలక పదవి..

shamala-14.jpg

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది సినీ సెలబ్రిటీలు కూటమికి సపోర్టు చేస్తే, మరి కొంతమంది సెలబ్రిటీలు వైసిపి పార్టీకి సపోర్టు చేశారు. అలా వైసిపి పార్టీకి మద్దతుగా నిలిచిన వారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. నిజానికి ఈమె 2019 కంటే ముందు నుంచి కూడా వైసిపికి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. అయితే ఈ సారి తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది శ్యామల. ఇదిలా ఉండగా తాజాగా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని దృష్టిలో పెట్టుకొని, వారందరికీ కీలక పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.

అందులో భాగంగానే పార్టీలో పలువురికి కీలక బాధ్యతలను అప్పగించారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా జగన్ నియమించారు. అలాగే తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్ష బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించడం జరిగింది. అంతేకాదు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా యాంకర్ శ్యామల, ఆర్కే రోజా, జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Share this post

scroll to top