నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది.
ఏపీ సభాపతిగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక..
