గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. ‘ఆమెనే కాకుండా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారి ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా’ అని అసెంబ్లీలో సీఎం వివరించారు.
అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా.. సీఎం చంద్రబాబు..
