సీఎం చంద్రబాబు ఈ నెల కూడా లబ్ధిదారులకు పింఛన్‌లు పంపిణీ చేయనున్నారు..

penshion-29.jpg

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల కూడా లబ్ధిదారులకు పింఛన్‌లు పంపిణీ చేయనున్నారు. ఈసారి ఆయన రాయలసీమ జిల్లాకు వెళుతున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం గుండుమలలో పర్యటిస్తారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, సింధూర రెడ్డి, కందికుంట వెంకటప్రసా,ద్ జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నలు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సవిత కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేస్తారన్నారు.

Share this post

scroll to top