ఏపీలో మందుబాబులకు పండగే పండగ..

liqur-30.jpg

రాష్ట్రంలో తెలంగాణ తరహా మద్యం విధానం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2019 కంటే ముందున్న తరహా మద్యం విధానాన్నే మళ్లీ రాష్ట్రంలో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. లిక్కర్ రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుంది. కేరళ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,  తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని స్వల్ప మార్పులతో ఏపీలోనూ తీసుకురాబోతున్నట్లు తెలిసింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల మనీ కట్టాల్సి ఉంటుంది. ఈ రుసుం  నాన్‌ రిఫండబుల్‌ అని అధికారుల ద్వారా తెలిసింది. మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్లు అనధికారికంగా తెలిసింది.

Share this post

scroll to top