మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించనుంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీనిలో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళల ఖాతాలో నెలకు రూ.1500 చొప్పున జమ చేయనున్నారు. అంటే సంవత్సరానికి రూ.18000 మహిళలకు సాయం కింద అందించనున్నారు. అయితే దీనికి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నారు. వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేస్తామని ప్రకటించినా.. మహిళలు ఎక్కువగా ఆకర్షితులు అయింది ఈ పథాకానికే అని చెప్పాలి. మేనిఫెస్టోలో ప్రకటించిన మరికొన్ని పథకాల్లో సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపును పూర్తి చేశారు. ఇప్పటికే పెండింగ్ నెలలకు సంబంధించి ఫిచన్లను కూడా పంపిణీ చేశారు. గత నెలలో లాగే ఆగస్టు నెలలో కూడా ఒకటో తేదీ ఉదయం 6గంటల నుండే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
