ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్‌ను వేశారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్ న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం
