ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంసపాలన మొదలైందని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చేశారు. శనివారం వేకువ జాము నుంచే పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వ దమనకాండ కొనసాగింది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఈ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తై.. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. రెండే రెండు గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరినీ వెళ్లనివ్వకుండా గేట్లు వేసి మరీ భారీగా పోలీసులు మోహరించారు.
ఏపీలో మొదలైన విధ్వంసపాలన..
