తెలుగు సినీ పరిశ్రమ విజయవాడకు తరలి రావాలి..

durgsh-25.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం, ట్రావెల్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.

సినిమాల చిత్రీకరణ జరిగితే రెవెన్యూ పెరుగుతుందని మంత్రి చెప్పారు. టికెట్ల ధరలు పెంచాలని అడుగుతున్నారని, తెలుగు సినిమాలకు తప్పకుండా సహకారం అందిస్తామని, అంతకంటే ముందు చిత్ర పరిశ్రమ విజయవాడకు తరలివస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, అందుకే పీపీపీ విధానంపై దృష్టిపెడుతున్నామని తెలిపారు. అందరి సలహాలు తీసుకొని అందరికీ అనుకూలంగా ఉండేలా త్వరలో టూరిజం పాలసీ తీసుకొస్తామని చెప్పారు.

Share this post

scroll to top