టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రజలకు హానికరమని, టీడీపీ ప్రభుత్వం, దాని ఆర్థిక ప్రయోజనాల కోసమే రూపొందించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. కొత్త మద్యం పాలసీ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కళ్యాణి మద్యం విక్రయాలను ప్రైవేటీకరించడాన్ని ఖండిస్తూ సిండికేట్‌లుగా ఏర్పడి పెద్దఎత్తున దోపిడీకి దారితీస్తుందని అన్నారు. నిత్యావసర సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచేందుకు ఎందుకు ప్రయత్నిస్తోందని ఆమె ప్రశ్నించారు. గతంలో ఉన్న విధానాన్ని రద్దు చేసి ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు కలిగిస్తోందని ఆమె అన్నారు.
ఆంధ్రాలో కొత్త మద్యం పాలసీ ప్రజలకు హానికరం..
