యానిమల్’ మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న త్రిప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఒక్క మూవీతోనే కుర్రకారుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. దీంతో ఈ అమ్మడు కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆమె డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో బంపర్ ఆఫర్ చేజిక్కించుకుంది ఈ అమ్మడు. ధనుష్ నటిస్తున్న ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తిను ఓకే చేశారు. ఇక ఈ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో దాదాపు పదేళ్ల కిందట ‘రాన్‌జనా’ అనే శాడ్ లవ్‌స్టోరి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా మళ్లీ వీరిద్దరు కలిసి పని చేస్తుండడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి..
హీరో ధనుష్‌తో యానిమల్ బ్యూటీ ప్రేమాయణం.. నువ్వు ఎవ్వరినీ వదిలిపెట్టవా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
