వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మధ్యే పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో సమావేశమైన బాలినేని కీలక చర్చలు జరిపారు. అయితే, ఆ చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బాలినేని బయటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని చెబుతూ వస్తున్న బాలినేని ఈ రోజు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపించారు. ఈవీఎంలపై తాను చేస్తోన్న పోరాటానికి వైసీపీ నుంచి సహకారం లేదని అసంతృప్తితో ఉన్నారట.
వైసీపీకి బిగ్ షాక్..
