ఏపీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ మొదటి అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కేబుళ్లు దగ్ధం, రూ.కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలను కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. అయితే చనిపోయింది ఒకరా? ఇంకా చాలా మంది ఉన్నారా? అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో మరో భారీ ప్రమాదం..
