రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, లీకులు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫోటోలు, వీడియాలు లీకై వైరల్ గా మారాయి. ఒడిషాలో సెట్స్ దృశ్యాలు, మహేష్ బాబు కొత్త లుక్ వీడియోలు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ఒడిషాలోని డియోమాలి ట్రెయిల్‌కు సంబంధించినది. ఈ వీడియోలో ఆయన ఒడిషాలోని అత్యంత ఎత్తైన శిఖరం డియోమాలికి సోలో ట్రెక్కింగ్ చేసిన అనుభవాన్ని పంచుకున్నారు.
వీడియోలో అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి, శిఖరం పై నుంచి చూసే విశాలమైన దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుందని రాజమౌళి పేర్కొన్నారు. అయితే, ఈ ట్రెయిల్‌లో చెత్త వేయడం వల్ల తనకు నిరాశ కలిగిందని రాజమౌళి వ్యాఖ్యానించారు. వీడియోలో శిఖరం పైన ప్లాస్టిక్ , ఇతర చెత్తా ను కూడా చూపించారు. ఆయన తన పోస్ట్‌లో ఇలా రాశారు: “డియోమాలి, ఒడిషాలోని అత్యంత ఎత్తైన,అద్భుతమైన శిఖరానికి సోలో ట్రెక్ చేయడం చాలా గొప్ప అనుభవం. పై నుంచి కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంది. అయితే, ట్రెయిల్‌లో చెత్త చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి ప్రకృతి సౌందర్యం మనం గౌరవించాలి. కొంచెం బాధ్యతతో ఈ ప్రదేశాలను కాపాడవచ్చు ప్రతి సందర్శకుడు తమ చెత్తను తిరిగి తీసుకెళ్లాలి అంటూ రాసుకొచ్చారు రాజమౌళి.