ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ అలయెన్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. కాగా, తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇప్పటికీ కేడర్, ఓటు బ్యాంకు ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే టీడీపీ పోటీకి దూరంగా ఉంది. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ, జనసేన అలయెన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కూటమి ఫార్ములాయే తెలంగాణలో ఇంప్లిమెంట్ చంద్రబాబు మరో సంచలన స్కెచ్..
