ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరుగనుంది . ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రంలోగా అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 18న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరుగునుంది. ఇటీవల ఏపీలో సంబవించిన వరదలు, భారీ వర్షాలకు జరిగిన నష్టంపై చర్చ, బాధితులకు పరిహారంతో పాటు మరికొన్ని పథకాలపై సుదీర్ఘంగా చర్చింది నిర్ణయం తీసుకోనున్నారు.
18న ఏపీ కేబినెట్ సమావేశం..
