మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ లభించనుందా? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రకటన ఇంకొన్ని గంటల్లో వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్ స్కీమ్ హామీని నెరవేర్చాల్సి ఉంది. ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే గత కొన్ని రోజులుగా ఈ స్కీమ్‌పై ఎక్కువగానే చర్చ నడుస్తోంది. ఆగస్ట్ 15న సీఎం చంద్రబాబు నాయుడు ఈ స్కీమ్ ను అధికారికంగా అమలు చేస్తారని చాలా గట్టిని అనుకున్నారు. అయితే మహిళలకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది.
అయితే రాఖీ పండుగ రోజున ఉచిత బస్ స్కీమ్ ప్రకటన అంశంపై అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేదు. అయితే చాలా మంది మాత్రం అదే రోజున ఉచిత బస్ స్కీమ్ ఉండొచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఇంకో 2 రోజులు ఆగితే అసలు విషయం తెలిసిపోతుంది. కాగా మంత్రులు, అధికారులు కూడా ఉచిత బస్ స్కీమ్ అతిత్వరలో అమలు అవుతుందని చెబుతూ వచ్చారు. అయితే కచ్చితంగా ఏ తేదీ నుంచి స్కీమ్ అమలు ఉంటుందో ఎవ్వరూ చెప్పడం లేదు. ఈ క్రమంలో రక్షాబంధన్ రోజున ఈ స్కీమ్ అములు ఉంటుందా? లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనా? అనే అంశం చూడాల్సి ఉంది.