కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అనేది ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం టీడీపీ-జనసేన సపోర్ట్ కేంద్రంలో కీలకం కావడంతో గత ఐదేళ్లలో పెద్దగా వినిపించని గుడ్ న్యూస్‌లు ఈ సారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి భారీ అంచనాలు ఉన్నాయి. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ మధ్యంతర బడ్జెట్ నేడు దేశ ప్రజల ముందుకు రాబోతోంది . బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండటం ఇది వరుసగా ఆరోసారి.
బడ్జెట్ పై ఏపీ ఆశలు..
