కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కనీవినీ ఎరుగని ఏర్పాట్లు!

cbn-25.jpg

రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట.తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు.. తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించనున్నారని తెలుస్తోంది.

Share this post

scroll to top