తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించవద్దని ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని టీటీడీ అధికారులకు సూచించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను గౌరవించాలని, దురుసు ప్రవర్తన ఎక్కడ కూడా ఉండొద్దని అన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సతీసమేతంగా తిరుమలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు. పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించవద్దని తెలిపారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని అన్నారు. తిరుమలలో అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పెంచాలని సూచించారు.
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి..
