ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. సెర్ప్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖపై దృష్టిపెట్టనున్నారు. సెర్ప్, MSME శాఖలపై సమీక్షించనున్నారు చంద్రబాబు. MSME కొత్త పాలసీ, MSME పార్కుల ఏర్పాటుపై చర్చించనున్నారు. NRI ఎంపవర్మెంట్‌పై చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఏపీ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సేవలను ఏ విధంగా వివియోగించుకోవచ్చు అనే అంశంపై చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనవరి నుంచి ప్రారంభం కాబోయే జన్మభూమి 2.0లో ప్రవాసాంధ్రులను భాగస్వాములు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. P-4 విధానం అమల్లో ప్రవాసాంధ్రుల పాత్రపై చర్చించే అవకాశం కూడా ఉందంటున్నారు అధికారులు.
నేడు కేబినెట్ సమావేశం తర్వాత కీలక సమీక్ష..
