వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..

chandrababu-05.jpg

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉన్నారు. నిన్న ఉదయం సీఆర్డీఏపీ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖపై రివ్యూ చేశారు. 2029నాటికి అర్హులందరికీ అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. PMAY 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబరు నాటికి లక్ష ఇళ్లు పూర్తవుతాయని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రబాబుకు అధికారులు చెప్పారు. ఇక, ఈ రోజు కూడా కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు.

Share this post

scroll to top