సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ముందుగా భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ కు ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఏపీ జీఎస్టీ-2024 చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదా కు కూడా ఓకే చెప్పారు.
2014-18 మధ్య కాలంలో ‘నీరు-చెట్టు’ పథకంలో భాగంగా పెండింగ్ బిల్లుల విడుదల, పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజవర్గం పరిధిలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ పరిధి 8,352 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి 154 గ్రామలను తిరిగి సీఆర్‌డీఏ పరిధిలోని తీసుకురానున్నారు. రాష్ట్రంలో జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.