సనాతనం సమ్మోహనం.. వారాహి దీక్షలో భాగంగా ఏకాదశ దిన ఆదిత్య ఆరాధన చేశారు పవన్ కల్యాణ్. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సూర్యభగవాణ్ణున్ని పూజించారు. సమాజహితం, దేశ సౌభాగ్యం కాంక్షిస్తూ లాస్ట్ ఇయర్ నుంచి వారాహి దీక్ష చేస్తున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈఏడాది కూడా వారాహి దీక్షను 11రోజులపాటు చేస్తున్నారు. జనసేన పార్టీ అఖండ విజయం.. కూటమి గెలుపు .. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత నెల 26న వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు పవన్. వారాహి దీక్ష ఈనెల 6వ తేదీతో ముగుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ఆదిత్య ఆరాధన పూజ నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరాధనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన సూర్యారాధనలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కి తిలకం దిద్దిన వేదపండితులు.. స్వామి వారి తీర్ధం ఇచ్చి దీక్ష ప్రారంభించారు.
చివరి దశకు పవన్ వారాహి దీక్ష.. ఆదిత్య ఆరాదనతో ప్రత్యేక పూజలు..
