ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.
రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్‌పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్‌లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన.