ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి, నగరాల అభివృద్ధికి ప్రభుత్వం కొత్త బాటలు వేయనుంది. వైజాగ్ లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23కిలోమీటర్ల మేరకు3 కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. మెట్రో లైన్ కారిడార్ వన్ లో విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీటర్లు, కారిడార్ రెండులో గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు, కారిడార్ మూడులో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీటర్ల మెట్రో నిర్మించేందుకు అంగీకారం తెలిపింది.
రెండో దశలో కారిడార్ నాలుగులో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30.67కిలోమీటర్ల వరకు మెట్రో లైన్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే విజయవాడలో మొదటి దశలో మెట్రో లైన్ కారిడార్ వన్ లో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, కారిడార్ రెండులో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు, రెండో దశలో కారిడార్ మూడులో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో నిర్మాణానికి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.