ఏపీలో కొత్త కార్డులపై కీలక అప్డేట్..

ration-09.jpg

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రేషన్‌ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. కొత్త రేషన్‌ కార్డుల్ని జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం జరిగే క్యాబినెట్‌లో కొత్త కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.కూటమి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికం కానున్నాయి. కొత్త కార్డుల జారీతో పాటుగా ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా మారటంతో ఇప్పుడు కార్డుల మంజూరు ప్రక్రియ కీలకంగా మారుతోంది. గతంలో ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించితే రేషన్‌ కార్డులకు అర్హులు కాదని గత ప్రభుత్వం నిర్ణయంగా అమలు చేసింది. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత కోల్పోయాయి.

Share this post