ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు లేనట్టే..

volunter-20.jpg

ఏపీ వాలంటీర్లకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు లేనట్టే అంటూ ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ల అంశంపై కౌన్సిల్ లో చర్చ జరిగిన సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 14-08-2023 తరువాత వాలంటీర్ల రెన్యువల్ జీఓ ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగంలో లేని వాలంటీర్లకు మే వరకూ జీతాలు చెల్లించామన్నారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. ఉద్యోగంలో లేని వారి రాజీనామాలు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. ప్రస్తుతం వాలంటీర్లు అయితే లేరని బాంబ్‌ పేల్చారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.

Share this post