సినీ నటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి ఆయనను అభినందించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకం. నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్ ఉపయోగించడం గౌరవంగా భావించా అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది నాకెంతో స్పెషల్ అన్నయ్యా..
