గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకుని మూడు ప్రత్యేక బృందాలు ఆయన కోసం వెళ్లాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గన్నవరం ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ తన కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారని చెబుతున్నారు. అయితే వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నారా? లేక అమెరికా వెళ్లారా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆయన కోసం మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడి కేసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నాడు ఎమ్మెల్యేగా ఉండి తన అనుచరులను రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ కేసును బయటకు వెలికి తీశారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తున్నారా?
