మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళీ కృష్ణ పై కేసు నమోదైంది. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భజరంగ్ దళ్ జూట్ మిల్లు స్థలాల విక్రయం, గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్స్ అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తున్నవేళ అంబటి సోదరులు బెదిరించడమే కాకుండా కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబూరావుపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పిల్లి బాబూరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాబూరావు హైకోర్టును ఆదేశించారు. అంబటి సోదరులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించడంతో అంబటి రాంబాబు, మురళీకృష్ణ తో పాటు మరికొందరిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.