డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో ఆయన విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన పోలీసులు మరోసారి నోటీసు ఇచ్చారు. ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో అన్నీ ఏర్పాట్లు చేశారు. తీరా అయన విచారణకు హాజరుకానని చెప్పడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని రాంగోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు.
డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం..
