ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్..

rejester-02.jpg

ఫిబ్రవరి-1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ర్టేషన్ చార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంచుతామని జనవరి 15 నాటికి అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ర్టేషన్ విలువలను తగ్గించబోతున్నామని చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదలగానీ తగ్గింపు కానీ ఉండదని యథాతథంగా ఉంటాయన్నారు.

వాస్తవానికి జనవరి 1 నుంచి రిజిస్ర్టేషన్ చార్జీలు సవరించాలని భావించింది ఏపీ ప్రభుత్వం. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసింది. భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి, ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకు ఉన్న డిమాండ్‌, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని చెప్పింది.

Share this post

scroll to top