డిప్యూటీ సీఎంగా నారా లోకేష్..

lokesh-18.jpg

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబునాయుడు కోరడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు నిర్వహించిన కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదికపైనే ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ టీడీపీలో లోకేష్‌ మూడో తరం నేత అని అన్నారు. యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Share this post

scroll to top