వర్షా కాలంలో ఈ పప్పులను తింటున్నారా.. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. పప్పులలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి వరంగా భావిస్తారు. అయితే వర్షాకాలంలో కొన్ని పప్పులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందని, అందుకే జీర్ణం కావడానికి సమయం పట్టే వాటిని తినడం మానుకోవాలని అంటున్నారు. వర్షా కాలంలో గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం పెరుగుతుంది. అందువల్ల.. బయటి జంక్ ఫుడ్‌తో పాటు, ఆరోగ్యకరమైనదిగా భావించే కొన్ని పప్పులను కూడా మనం తినకూడదు. వర్షాకాలంలో తేమ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని పప్పులు అధిక పోషక విలువలను కలిగి ఉండటం వలన సులభంగా జీర్ణం కావని అంటున్నారు.
వర్షా కాలంలో ఈ పప్పులను తింటున్నారా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం..
