హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి..

asha-work-10.jpg

రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఉద్యమబాట పట్టారు. తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తల సమస్యలపై శాసనసభలో చర్చించాలని కోరుతూ ఈనెల జనవరి 10న ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు, చేపట్టాలని ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పిలుపునిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్‌ కార్యాలయం ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశాల పట్ల ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డిని ఇంటిని ముట్టడించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగభద్రత కోసం పదిహేడేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జాబ్‌చార్ట్‌ లేకుండా నిర్ణీత పనే కాకుండా సర్వేలకు, ఇతర పనులకు వినియోగిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Share this post

scroll to top