ఇవి మనకు వరం లాంటివి..

bopaya-17.jpg

వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ డెంగ్యూ ముప్పు కూడా పెరుగుతుంది. ఇది ప్రమాదకరమైన వ్యాధి.. అంతేకాకుండా వేగంగా వ్యాపిస్తుంది.. ఒక్కొసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. డెంగ్యూలో అతి పెద్ద ఆందోళన ఏంటంటే.. ప్లేట్‌లెట్స్ పడిపోవడం.. ఇది ఒక్కోసారి అత్యవసర వైద్యపరిస్థితి కావొచ్చు.. అయినా.. ఇలాంటి సందర్భాల్లో అస్సలు భయపడవద్దు.. ప్రకృతి మనకు అద్భుతమైన బహుమతిని ఇచ్చింది.. అవే బొప్పాయి ఆకులు.. వీటిని ఆయుర్వేదంలో గొప్పవిగా పరిగణిస్తారు. అవును, బొప్పాయి ఆకులు మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా డెంగ్యూ చికిత్సలో దివ్యౌషధంగా కూడా పనిచేస్తాయంటున్నారు.

ప్లేట్‌లెట్స్‌ను పెంచుతుంది:

 బొప్పాయి ఆకుల్లో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్స్ ఏర్పడటాన్ని పెంచుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తగ్గడం వల్ల, శరీరం బలహీనంగా మారుతుంది.

జ్వరాన్ని తగ్గిస్తుంది: 

బొప్పాయి ఆకుల్లో యాంటీ పైరెటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డెంగ్యూలో అధిక జ్వరం సాధారణం.

బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్లను ఎంత వేగంగా పెంచుతాయి:

అయితే బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య 24 గంటల్లోనే వేగంగా పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

బొప్పాయి ఆకుల టీ:

దీని కోసం, 2-3 ఆకులను ఉడికించి, వాటిని వడపోసి రోజుకు రెండుసార్లు త్రాగాలి. బొప్పాయి ఆకులను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు తినకూడదని గుర్తుంచుకోండి .

Share this post

scroll to top