తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పండుగతో ఈ పండగ ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. వేకువజామునే పిల్లలు, పెద్దలు, మహిళలు వీధుల్లో, ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగూత పాడుతూ, డ్యాన్సులు వేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని వాడవాడలా భోగి మంటలతో సందడి వాతావరణం నెలకొంది.